18 జూన్, 2026

వెలుగుకు తెలిసిన రహస్యం

 వెలుగుకు తెలిసిన రహస్యం




ఎందుకలా...

సూర్యుడు నీ ముఖాన్ని

ముద్దాడుతున్నాడు?

నీ నవ్వులో

ఉదయపు వెలుగు దాగి ఉందని

అతనికే ముందుగా తెలిసిపోయిందేమో!

ఎందుకలా...

గాలి నీ జుట్టుతో ఆడుకుంటోంది?

పూల పరిమళం కంటే

నీ సాన్నిధ్యమే మత్తెక్కిస్తుందని

గ్రహించిందేమో!

ఎందుకలా...

చెట్లు నీ వైపే వంగి చూస్తున్నాయి?

వసంతం తన పచ్చదనాన్ని

నీ కళ్లలో చూసుకుని మురిసిపోతుందేమో!

ఎందుకలా...

నా మనసు మాత్రం

నీ చుట్టూనే తిరుగుతోంది?

ఈ ప్రపంచమంతా

నీలోని అందాన్ని ఆస్వాదిస్తుంటే,

నేను మాత్రం

నీలోని ఆత్మను ప్రేమిస్తున్నానేమో!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

18-06-2026.

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి