21 మే, 2026

అంతర్జాతీయ తేనీటి దినోత్సవం

 అంతర్జాతీయ తేనీటి దినోత్సవం 


వాన కురిసియు ధరణిని వలచు నట్లు

వేడి తోడను దనువును వేడ్క సేయు

చాయె యెప్పుడు నలసట చాల ద్రోసి

జీవ గర్రయ నగుచును జెంత నిల్చు!


మందు తినియును రోగము మాను నట్లు

మాయ జేయును దలనొప్పి మమత తోడ

తేట తేనీరు జగతికి దివ్య మౌచు

కంటి పాపగ నిల్చును గార వమున!


కూర్మి తోడను నెచ్చెలి గూడి నట్లు

కష్ట కాలము నందున గాచు నెరన

బుద్ధి కెప్పుడు నిచ్చును బొసగ శక్తి

మెచ్చు లోకము దీనిని మేటి యనగ.


దివ్య మౌనట్టి యమృతము దేవ తలకు

దీర్చి నట్టుల యలసట దిశల యందు

భూరి శ్రమలను జేసెడు బుధుల కెల్ల

భూరి తృప్తిని నిచ్చును బొసగ జాయె!


మంచి పసరును ద్రావియు మనుజు డెంతొ

మరల నూపిరి బొందుచు మహిమ గనగ

మంద భాగ్యుల కలసట మాన్ప జేయు

మధుర తేనీరు జగతికి మందు వలెను!


బాట సారికి నెండలో భాను తాప

బాధ నంతయు గాలియు బాపినట్లు

కంటి నిద్రను ద్రోయుచు గాచు నెరన

కమ్మ నైనట్టి తేనీరు గాంతి తోడ!


దాహ మొందిన వానికి దయను మేఘు

దమృత మును బోలు నీరిచ్చి యాదు నట్లు

సార శ్రమలను జేసెడు జనుల కెల్ల

సత్తు వను నిచ్చు తేనీరు జగతి యందు.


వాడి పోయిన తీగకు వనజ మాలి

వెల్లువగ నీరు బోసియు వెలుగు నిడున

దనువు నందలి బడలిక దరమ గలదు

కమ్మ నైనట్టి తేనీరు గాంతి తోడ!


అలసి వచ్చిన బిడ్డను నమ్మ యెపుడు

ఆద రము తోడ లాలించి యాదు నట్లు

మను జులకు నున్న యలసట మాన్ప జేయు

మధుర తేనీరు జగతికి మందు వలెను!


డా.దార్ల వెంకటేశ్వరరావు 21.5.2026

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి