04 మే, 2026

అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం -2026

 అంతర్జాతీయ అగ్నిమాపక సిబ్బంది దినోత్సవం 


ప్రాణ రక్షణ పరమని పరుగు దీయు

అగ్ని కీలల నణచును అపుడు వీడు

ధైర్య వంతుడు ధరణిని ధన్య మూర్తి

వంద నములిడు వారికి వరుస గాను.


ఆప దందున అండగా అరుగు దెంచు

శాంతి దూతగ సమయము చాటి చెప్పు

మేలు జేయును మహిమతో మిగుల దయను

వీర యోధుని వినయము వెలుగు నిచ్చు.


ప్రాణ రక్షణ పరమని పరుగు దీయు

మంట లణచును మహినిని మహిమ తోడ

ధైర్య వంతుడు ధరణిని ధన్య మూర్తి

వంద నములిడు వారికి వరుస గాను.


సాహ సమ్మది సరిలేని శక్తి నిచ్చు

దీన జనులను దేరును దివ్య గతిని

అగ్ని కీలల నణచును ఆప్త వృత్తి

వీర యోధుని వినయము వెలుగు నిచ్చు.


కష్ట మెంచక కరుణతో గమ్య మునను

నిప్పు రవ్వల నెదిరించు నిపుణ గతిని

ఆప దందున అండగా అరుగు దెంచు

శాంతి దూతగ సమయము చాటి చెప్పు.


వీర యోధుని వినయము వెలుగు నిచ్చు

దీన జనులను దేరును దివ్య గతిని

మేలు జేయును మహిమతో మిగుల దయను

ధైర్య సాహస ధరణిని ధన్య మగును.



అగ్ని కీలల నణచును అపుడు వీడు

నిప్పు రవ్వల నెదిరించు నిపుణ గతిని

వీర కృత్యము వెలయగా విమల మూర్తి

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


కరుణ తోడను కష్టము గెలుచు నతడు

మేలు జేయును మహిమతో మిగుల దయను

శాంతి దూతగ సమయము చాటు నపుడు

ప్రణతి జేతుము పావన భావ మెరిగి.




సాహ సమ్మది సరిలేని శక్తి నిచ్చు


నిరత మెప్పుడు నిలచును నీతి తోడ


ప్రజల గాచును బహుమాన భావ మమర


వంద నములిడు వారికివరుస గాను.


దార్ల వెంకటేశ్వరరావు 

4.5.2026



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి