17 ఏప్రిల్, 2026

అంతర్జాతీయ రైతు దినోత్సవం 2026

 అంతర్జాతీయ రైతు దినోత్సవం 2026


నేల తల్లిని నమ్మియే నిరతముండు

చెమట చుక్కల జిల్కియే జేయు సేవ

ముక్కు పచ్చలారని నాటి ముచ్చటైన

కర్షకుండన్న జగతికి కల్పతరువు.


హక్కు లన్నియు గోరుచు హలధ రుండు

కష్ట జీవుల గొంతుకై కదలి వచ్చె

న్యాయ రక్షణ కోరుచు నాడు నేడు

రైతు పోరాట మే గదా రాజ్య బలము.


బువ్వ బెట్టెడి చేతులు మురటు వారె

మనసు వెన్నయే నిరతము మమత తోడ

లోక సౌఖ్యము గోరుచు లోభి కాక

కర్ష కుని గెలు పే గదా కమ్మ నౌచు.


ముత్య మౌనుగా కర్షకు ముఖము పైన

నిత్య మును జించు చెమటయే నిజము గాను

పసిడి పండించు నేలమ్మ పాద చెంత

కష్ట జీవుల చెమటయే కమ్మ నౌను.


వరుస గట్టియు కదిలెను వసుధ పైన

హక్కు రక్షణ కోరుచు హలము బట్టి

పిడికి లిని బిగించియు బిగ్గరగాను

న్యాయమును గోరి నిలిచెను నాడు రైతు.


వరుస గట్టియు కదిలెను వసుధ పైన

హక్కు రక్షణ కోరుచు హలము బట్టి

పిడికి లిని బిగించియు భీతి లేక

న్యాయ మును గోరి నిలిచెను నాడు రైతు.


ముత్య మౌనుగా కర్షకు ముఖము పైన

నిత్య మును జించు చెమటయే నిజము గాను

పసిడి పండించు నేలమ్మ పాద చెంత

కష్ట జీవుల చెమటయే కాంతి నిడును.


ఎద్దు లమ్మకు సాటియే ఎన్న గూడ

రైతు బిడ్డకు తోడుగా రాణ కెక్కు

పంట కాలాన స్నేహము పాట జేయు

విశ్వ మంతయు మెచ్చును విరివి గాను.


జై కిసా నను శబ్దము జగతి నిండ

రైతు లోకము గెలువగ రావలయును

నీతి తోడను సాగును నికర పోరు

విశ్వ శాంతికి రైతులే విలువ నిడుదు.


ఎద్దు లమ్మకు సాటియే ఎన్న గూడ

రైతు బిడ్డకు తోడుగా రాణి చుండు

పంట కాలాన స్నేహము పాలి చుండు

విశ్వ మంతయు మెచ్చును విరివి గాను.


జైకిసా నను శబ్దము జగతి నిండ

రైతు లోకము గెలువగ రావ లెపుడు

నీతి తోడను సాగును నికర పోరు

విశ్వ శాంతికి రైతులే వేరు కాదు.


విశ్వ కర్షక లోకము వేగ మేల

ఏకమై నిల్వవలెనిదే ఏప్రిలునను

నీతి తోడను సాగును నిత్య పోరు

జై కిసాన్ నినాదమనేడు జగతి పాట.


ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

17.4.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి