10 ఏప్రిల్, 2026

ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 2026

 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం 


ఎండ వానల కోర్చియు ఎగిరి వచ్చు

వింత విహగము వేగమే వీడ కుండ

దూర దేశము దాటియు దరికి జేరు

కనుల పండుగ జేయును కాంతి తోడ.


గాలి మేడల గరిమతో గాలి లోన

చెంత జేరును చిత్రము చేత లమర

మంచి బుద్ధులు మహిమతో మనుల కిడగ

ప్రజల మెప్పును పొందును పావనముగ.


నింగి వీధుల నిరతము నిలచు చుండ

తరువు లందున తగువుగ తలపు నింపు

సాటి లేనట్టి సాహస శక్తి తోడ

మేలు నిచ్చును మిత్రుడై మేటి గాను.


నీలి నింగిని నిశ్చల నిపుణ గతిని

రాణ కెక్కెడు రమ్యమై రాజ సమున

పక్షి జాతులు పాయక పటిమ తోడ

ధరణి వెలయును ధన్యమై ధార వోసి


ఏరు దాటుచు ఎగిరెడు ఎనరు తోడ

వింత చిత్రము వెలయగ వీడు నపుడు

అండ దండలు అమరగ ఆశ నిచ్చి

మెప్పు నొందును మేటియై మిగుల భువిని.


చక్క నైనట్టి చెలిమితో చాటు చుండ

ప్రాణ దానము పరమని పరగు చుండ

అమల శాంతిని అందము అమర జేసి

మేలు కలిగెడు మైత్రిని మేటి గాను.


ముక్తి నిచ్చును మహిమతో ముదము తోడ

తరువు లందున తగువుగ తలపు నింపు

సాటి లేనట్టి సాహస సాధి తముగ

కీర్తి నొందును కరుణతో కీర్త నీయ.


డా.దార్ల వెంకటేశ్వరరావు, 9.5.2026


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి