03 సెప్టెంబర్, 2025

వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సత్కారం

 వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో సత్కారం





ఆరుద్ర శతజయంతి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ సాంస్కృతిక సంస్థ హైదరాబాద్ వారు శ్రీ త్యాగరాయ గాన సభ, హైదరాబాదు లో 31.8.2025 వ తేదీన ఆరుద్ర పాటలతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. 

ఆరుద్ర రచనలపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు తెలుగు శాఖ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పరిశోధన చేశారు. ఆచార్య ఎస్ శరత్ జ్యోత్స్నా రాణి గారి పర్యవేక్షణలో 1998లో రిజిస్టర్ చేసుకుని 2003 నాటికి తన సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేశారు. పరిశోధకుడుగా ఆరుద్ర అనేది ఆయన పరిశోధనాంశం.

ఆరుద్ర పై పరిశోధన చేసినందుకుగాను వంశీ ఇంటర్నేషనల్ సంస్కృతిక సంస్థ ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని సత్కరించింది. 

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారిని సత్కరిస్తున్న వంశీ ఇంటర్నేషనల్ సాంస్కృతిక సంస్థ చైర్మన్ డాక్టర్ వంశీ రామరాజు గారు 
జ్యోతి ప్రజ్వలనం చేస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
తన పరిశోధన విశేషాలను వివరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై శ్రీ రామకృష్ణ ఫణి, డా.వంశీరామరాజు గార్లు ఉన్నారు.



తన పరిశోధన విశేషాలను వివరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు
తన పరిశోధన విశేషాలను వివరిస్తున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, వేదికపై శ్రీ రామకృష్ణ ఫణి, డా.వంశీరామరాజు గార్లు ఉన్నారు.

డా. వంశీ రామరాజు గారితో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

బ్యానర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి