04 జూన్, 2025

చలపతిరావు గారి పద్యాలు... ఏడో ఋతువు ఆవిష్కరణ

 


కం.

మాసాంతమునందు నిదియె

భాసితమగు మీప్రసంగ పాఠవ మిదియే!

చూసితి!ఖండాంతరమున

వాసితమై తెలుగునిలచె!వర్థిత శోభల్!


ఆ.వె.

మంచి మనిషివాక్కుమహిత గుణమునిచ్చు!

మనసు మంచిదనగ మనిషి దార్ల !

విద్యనందినట్టి విజ్ఞుడితడు దార్ల! 

కోరిబిలచు నితని కూర్మితోడ!


      ‘కవికోకిల’ డా.జె.వి.చలపతిరావు

        ఆంధ్రోపన్యాసకులు, విజయవాడ

31.8.2024


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి