05 సెప్టెంబర్, 2017

ప్రకృతికి కొత్తరూపొచ్చిందీ నాడే

భూదేవిమాతృస్ఫర్శతో
మురిసిపోయిందీ 
ఈనాడే!

విశాలత్వంతో ఆకాశమంతా
చిగురించిందీ 
ఈనాడే!

నక్షత్రాలన్నీ తారాతోరణాలై 
ఒక్కసారిగా కురిసిందీ 
ఈనాడే!

సాగరుడు
నదీసంగమంతో
తియ్యనికెరటమైందీ
ఈనాడే! 

ఐదులు పదులై..
రెండ్లొకటై 
కొత్త రూపొచ్చిందీ
ఈనాడే!
- దార్ల 
5 సెప్టెంబర్ 2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి