హెచ్ సియు లో ఘనంగా
"బియాండ్ ఫ్రాంటియర్స్" పుస్తకావిష్కరణ
అంతర్జాలం ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రొఫెసర్ దాసన్ఆవిష్కరణ ఆహ్వాన పత్రిక
నా పత్రం ' Deconstructing Hegemony: A Socio-Philosophical Analysis of Ritual Purity and Dalit Identity in Kolakauri Enoch's Kulavritti"కూడా దీనిలో ప్రచురితం.
హెచ్‌సియు (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ)కి చెందిన సెంటర్ ఫర్ కంపారిటివ్ లిటరేచర్ లో ప్రొఫెసర్ గా చేస్తున్న జె.భీమయ్య సంపాదకత్వంలో వెలువడిన "బియాండ్ ఫ్రాంటియర్స్: ఇంటర్‌డిసిప్లినరీ రీడింగ్స్ ఇన్ ఇండియన్ రీజినల్ లిటరేచర్" (Beyond Frontiers: Interdisciplinary Readings in Indian Regional Literature) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆన్లైన్ వేదికగా (30.10.2026 తేదీన) శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. గతంలో హెచ్ సియు, సిసి ఎల్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో సమర్పించిన పత్రాలను ప్రొఫెసర్ జె. భీమయ్య సంపాదకత్వంలో ఈ పుస్తకంగా వెలువరించారు. ఈ కార్యక్రమంలో విద్యావేత్తలు, పరిశోధకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సుకు మైసూర్ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగపు మాజీ అధిపతి ప్రొఫెసర్ ఎ. ఎస్. దాసన్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి ముఖ్య అతిథిగా మాట్లాడిన మైసూర్ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగపు మాజీ అధిపతి ప్రొఫెసర్ ఎ. ఎస్. దాసన్ మాట్లాడుతూ.. పుస్తకంలోని పత్రాల విశేషాలను కొనియాడారు. ఇది కేవలం ఇంటర్‌డిసిప్లినరీ (అంతర్-శాస్త్రీయ) అధ్యయనం మాత్రమే కాదని, మమనిషి సాధారణ అనుభవ పరిధిని దాటిన వినూత్న వస్తువులతో కూడిన పరిశోధన పత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఆయన అన్నారు.ప్రత్యేక అతిథిగా విచ్చేసిన పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగానికి చెందిన ప్రొఫెసర్ నందిని భట్టాచార్య ప్రసంగిస్తూ.. ఇది ప్రాంతీయమా లేక జాతీయమా అనే సరిహద్దుల కంటే మించి, విభిన్న మాతృభాషల నుంచి వెలువడిన గొప్ప సాహిత్యం ఈ పుస్తకంలో ఇమిడి ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మిగతా అతిథులు, వక్తలు మాట్లాడుతూ.. భారతీయ ప్రాంతీయ సాహిత్యాల మధ్య ఉన్న అంతరాలను చెరిపివేస్తూ, వివిధ శాఖలను అనుసంధానించడానికి ఇటువంటి గ్రంథాలు ఎంతగానో దోహదపడతాయని అభిప్రాయపడ్డారు.
జనప్రతిధ్వని దినపత్రిక 31.10.2026 సౌజన్యంతోప్రాంతీయ సాహిత్యాల్లోని ప్రత్యేకతలను సమకాలీన దృక్పథంతో అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శిగా నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగానికి చెందిన ప్రొఫెసర్ టి. విజయ్ కుమార్, వెస్ట్ బెంగాల్‌లోని బుర్ద్వాన్ విశ్వవిద్యాలయ ఆంగ్ల విభాగానికి చెందిన ప్రొఫెసర్ నందిని భట్టాచార్య పాల్గొని ప్రసంగించారు. గౌరవ అతిథులుగా హెచ్ సియు తెలుగు విభాగపు మాజీ అధిపతి ప్రొఫెసర్ దార్ల వెంకటేశ్వర రావు, సెంటర్ ఫర్ కంపారిటివ్ లిటరేచర్ హెడ్ ప్రొఫెసర్ వంశీ కృష్ణ రెడ్డి విచ్చేసి అభినందనలు తెలిపారు.జాషోర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బంగ్లాదేశ్) సహాయ ఆచార్యులు, పీహెచ్డీ స్కాలర్ తన్మయ్ మజుందార్ కన్వీనర్‌గా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో చివరిగా పీహెచ్డీ స్కాలర్ ఆర్. లాల్హ్రియాట్పుయి వందన సమర్పణ చేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రజ్యోతి దినపత్రిక 31.10.2026 సౌజన్యంతో
...
నేను మాట్లాడిన పూర్తి పాఠం:
Guest of Honour Professor. Darla Venkateswara Rao 's address:
Book Launch: Beyond Frontiers
Respected Professor J. Bheemaiah, Professor Vamshi Krishna Reddy, Professor A. S. Dasan, Professor T. Vijay Kumar, Professor Nandini Bhattacharya, Professor Tanmoy Mazumder, other distinguished scholars, and dear friends,
A very good afternoon to everyone.
It is a pleasure and an honour to be part of this academic gathering organised by the Centre for Comparative Literature, University of Hyderabad.
First, I sincerely thank Professor J. Bheemaiah for including my research paper in this important volume, Beyond Frontiers: Interdisciplinary Readings in Indian Regional Literature. I appreciate his academic vision and dedicated efforts in bringing together diverse literary and critical perspectives.
This volume provides an opportunity to look at Indian regional literatures through interdisciplinary perspectives and to understand their wider social and cultural significance.
My paper, titled “Deconstructing Hegemony: A Socio-Philosophical Analysis of Ritual Purity and Dalit Identity in Kolakaluri Enoch's Kulavritti,” examines caste-based notions of ritual purity, social hierarchy, and the assertion of Dalit identity. I am glad that this critical perspective has found a place in this scholarly publication.
I am particularly happy to share this platform with distinguished scholars such as Professor Vamshi Krishna Reddy, Professor A. S. Dasan, Professor T. Vijay Kumar, and Professor Nandini Bhattacharya. I look forward to listening to their valuable insights.
My special appreciation goes to Professor J. Bheemaiah for bringing us together through this academic initiative.
I congratulate the editor, publisher, and all the contributors. I wish this book a meaningful journey among readers and researchers.
Thank you very much.
Darla Venkateswara Rao, 30.10.2026
మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు









కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి