27 మార్చి, 2026

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

 





శ్రీరాముని పద భక్తియు

ధారాళముగాగ నొసగు ధర్మము నెపుడున్

కోరిన శుభముల నిచ్చును

శ్రీరామనవమి శుభములు స్థిరముగ 'దార్లా!'


ధర్మ మార్గమందు తారక మంత్రమై

వెలుగు చుండు నెపుడు విభుడు రాము

డవని జనుల కెల్ల నండగా నిలచును

రామ నవమి శుభము -రమ్య 'దార్ల! '

(లోకంలో ధర్మ మార్గంలో నడిచే వారికి శ్రీరామ నామమే ఒక 'తారక మంత్రం'లా ఉండి ఎల్లప్పుడూ దారి చూపుతుంది. ఆ ప్రభువైన శ్రీరాముడు ఈ భూమిపై ఉన్న జనులందరికీ కష్టకాలంలో అండగా నిలుస్తాడు. అటువంటి రమ్యమైన గుణములు కలిగిన రాముని జన్మదినమైన ఈ శ్రీరామనవమి అందరికీ శుభాలను చేకూర్చాలి.)

సాధు సజ్జన రక్షణ సత్య శీలి

కపట మెరుగని దయగల కరుణమూర్తి

భక్త కోటిని బ్రోచును పరమ పురుష

రామ నవమిన శుభములు రమ్య 'దార్ల!

(శ్రీరాముడు మంచివారిని, సాధువులను రక్షించే సత్యశీలి. ఆయన హృదయంలో ఎటువంటి కపటం ఉండదు, కేవలం దయతో నిండిన కరుణామయుడు. ఆ పరమపురుషుడు తనను నమ్ముకున్న భక్తకోటిని ఎల్లప్పుడూ కాపాడుతుంటాడు. అటువంటి శ్రీరాముని నవమి పర్వదినం సందర్భంగా అందరికీ శుభములు కలగాలని ఆకాంక్షి

స్తున్నాను.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి