▼

08 మార్చి, 2026

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 2026

 


అమ్మ యగుచు నిచ్చు  అమృతపు దీవెన

ధరణి మోయు నట్టి  ధైర్య గుణము

శాంతి మూర్తి యగుచు సాగును మహిళయే

దారి పూలతోట దార్ల మాట


ఆడ బిడ్డ పుట్ట  ఆనందమొందాలి

లక్ష్మి ఇంట వెలసె నన్న రీతి

గౌరవించు వాడు గాంచును పుణ్యము

దారి పూలతోట దార్ల మాట


చదువు నేర్చి నేడు చలన చిత్రము వోలె

నింగి కెగసె మహిళ నిఖిల లోక

శక్తి రూపమగుచు సాధించు నెల్లను

దారి పూలతోట దార్ల మాట


మాతృ మూర్తి కంటె మహిమలె లేవురా

వెలిసె లక్ష్మి యనుచు వేల్పుగాను

పూజ సేయ వలెను పుడమిపై నెప్పుడు

దారి పూలతోట దార్ల మాట


ఇల్లు దిద్దు నామె ఇలవేల్పు గనుజూడు

ఓర్పు తోడ జూపు నొప్పు లన్ని

ప్రేమ పంచె నట్టి పెన్నిధి యగు నిల

దారి పూలతోట దార్ల మాట




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి