▼

06 ఫిబ్రవరి, 2026

బాబు (శ్రీనివాసరావు) తొలి విహారయాత్ర సమయాన...

 

​బాబు తొలి విహారయాత్ర 

 


​ఆ.వె.

విరిసె నెమలి యట్లు విహారయాత్రకు

మురిసి గంతు లేసె ముద్దు బిడ్డ

వింత లన్ని చూడ విరులు పూచిన యట్లు

చిన్ని మనసు నిండె సిరుల నవ్వు.

 


​ఆ.వె.

​వేచి యుండె బిడ్డ విహారయాత్రకు

రేయి నిదుర లేదు రాజ సుతుకు

వేగు జుక్క పొడిచె వేళ యయ్యెను గద

ముద్దు బిడ్డ వెడలె మురిపమునను.

ఆ.వె.

​విడవ లేక తల్లి విహారయాత్రకు

పంపె బిడ్డ నపుడు భయము తోడ

విరజ నిమ్మటంచు విభుని వేడుకొనెను

అమ్మ మనసు నిండె ఆత్ర మందు.

 


వినగ జెప్పె తండ్రి విహారయాత్రకు

బుద్ధి మాట లెన్నొ పొందు పరచి

విక్ర మార్కు డట్లు వినయ గుణము తోడ

మెలుగు మంచు పలికె మేలు గోరి.

ఆ.వె.

​వినగ జెప్పె తండ్రి విహారయాత్రకు

బుద్ధి మాట లెన్నొ పొందు పరచి

విక్ర మార్కు డట్లు వినయ గుణము తోడ

మెలుగు మంచు పలికె మేలు గోరి.

 


ఆ.వె.

విమల దీప మట్లు విహారయాత్రకు

వెలుగు నవ్వు లొల్కె వింత గాను

విజ్ఞు లైన వారు వినయమున దీవింప

దిష్టి తీసి పంపి రిష్ట మెనగ.

-      ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

6.2.2026

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి