05 డిసెంబర్, 2025

ఇన్నేళ్ళెలా ఉన్నావీ కళ్ళల్లో

 ఇన్నేళ్ళెలా ఉన్నావీ కళ్ళల్లో

కళ్ళెదుటిప్పుడు దృశ్యమైనా
ఇన్నాళ్ళూ కనురెప్పల్లోనే దాగున్నావు!
కళ్ళు కూడా ప్రసవిస్తాయేమో
కాకుంటే కనురెప్పల్లోనుండి
కళ్ళెదుటిలాసజీవదృశ్యమెలాసాధ్యం?
కళ్ళకీ దాహముంటుందేమో
చిరుజల్లువై కురిసావు
చూపుల మొక్కలెలా
చిగురిస్తున్నోయో చూడు!
కళ్ళకీ తాళాలుంటాయేమో
ఆ రూపాన్నిలా బంధించి
దృశ్యం దూరమవకుండా
రెప్పల తలుపులకేసిన బీగాలు చూడు!
-దార్ల
3.11.2017

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి