07 సెప్టెంబర్, 2025

నిదానమే ప్రధానం!

 నిదానమే ప్రధానం

అంతరంగాన్ని ఆవిష్కరించేయడమంత సులువనుకున్నావా

చూసినవెంటనే పట్టేయడానికీ

మాట్లాడినంతనే చదివేయడానికీ

మెతుకును పట్టి చూసినంత తేలిక్కాదు

అది మనో ప్రపంచం

దానిలో ప్రతిమనిషీ ఓ లిల్లీపుట్ !


తెలిసీతెలియని తీర్పులిచ్చేసి

నిజం మనముందు నిలబడినప్పుడు 

కన్నీటి చుక్కను జారవిడిచినంత తేలిక్కాదు

ఘనీభవించిన నవ్వుల్ని మళ్ళీ ప్రవహింపజేయడం! 


ప్రశంసను పెదవులపై ఉంచుకో

నిందించేదైతే నాలుగురోజులు నిరీక్షించు

ఒకవేళ నిర్థారణకాలేదనుకుంటే

అసలు నిందించడాన్నే వాయిదావేసుకో

నిజం నిప్పులాంటిది కదా

లోలోనే మండినా పొగనెవరూ ఆపలేరు!

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు

7.9.2025


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి