23 ఆగస్టు, 2025

సినీవాలి ( కవిత)

 సినీవాలి అంటే ఏమిటో

ఇన్నాళ్ళకు తెలిసింది

మనసు నిండా కటిక చీకటి

దాన్ని పైకి కనిపించకుండా 

ఓ వెన్నెల రేఖను మెరిపించడమని

నాకిప్పుడే తెలిసింది


కాళ్ళకింద అగ్నిగుండాలున్నా

కళ్ళలో కాంతి కిరణాలు జల్లుతూ

నాకు నేనే చీకటిని కప్పేసుకోవాలనిపిస్తుంది






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి