19 జూన్, 2023

అరసం ఆధ్వర్యంలో ఆచార్య దార్ల ప్రసంగం 'అభ్యుదయ సాహిత్య విమర్శకుడుగా వల్లంపాటి '

 సాహిత్య విమర్శకు వస్తు, శిల్పాలు రెండూ అవసరమే

,



భూమి పుత్ర దినపత్రిక, 19.6.2023 సౌజన్యంతో 
తెలుగు న్యూస్ టైమ్స్ దినపత్రిక 



సాహిత్య విమర్శకుడికి ఒక దృక్పథం ఉంటుందనీ, అయితే ఆ దృక్పథం రచనలోని ఉత్తమ లక్షణాలను నిరోదించేలా ఉండకూడదని, వక్రభాష్యాలిచ్చేలా మారకూడదని, సాహిత్య విమర్శకు వస్తు,శిల్పాలు రెండూ అవసరమేనని భావించిన సాహిత్య విమర్శకుడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య అని హెచ్.సి.యు తెలుగు శాఖ అధ్యక్షులు, ప్రముఖ సాహిత్య విమర్శకులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం (అరసం) వారు ఆదివారం నాడు అరసం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్ అధ్యక్షతన (18.6.2023) నిర్వహించిన అంతర్జాల సదస్సులో ముఖ్యవక్తగా పాల్గొని ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ‘అభ్యుదయ సాహిత్య విమర్శకుడుగా వల్లంపాటి’ అనే అంశంపై సుమారు గంటన్నరపాటు ప్రసంగించారు. 

తెలుగు సాహిత్య విమర్శ రంగులో తనదైన ముద్ర వేసిన వల్లంపాటి  భారతీయ సాహిత్య సిద్ధాంతాలు, పాశ్చాత్య సాహిత్య విమర్శ మౌలికాంశాలను  లోతుగా అధ్యయనం చేసిన ఉత్తమ విమర్శకుడనీ దార్ల పేర్కొన్నారు. 

రాయలసీమ భౌగోళిక, చారిత్రక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక మూలాలను ఆధారం చేసుకొని సామాజిక, సాంస్కృతిక దృక్పథంతో సాహిత్యాన్ని అనుశీలించడం నేర్చిన సైద్ధాంతిక విమర్శకుడనీ చెప్పారు. 

వల్లంపాటి రాసిన కథా శిల్పం, నవలా శిల్పం, విమర్శ శిల్పం, ఇతర వ్యాసాలు సాహిత్య విమర్శకారులకు దారి దీపాలు. ఆయన అనువదించిన గ్రంథాలన్నీ చరిత్ర, సామాజిక సాహిత్య రంగాలలో అభ్యుదయకరమైన ఆలోచనలకు ప్రేరకాలని అన్నారు

ఈ కార్యక్రమంలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, డా.పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం సోషల్ మీడియా కార్యనిర్వహక కార్యదర్శి ఎ.ఎమ్.ఆర్. ఆనంద్, ప్రముఖ రచయిత వంకిరెడ్డి రెడ్డప్పరెడ్డి, డా.బడిగె ఉమేశ్, డా. పెద్దింటి ముకుందరావు, డా. బాసెట్టి లత, డా.రామ్ ప్రసాద్ నలసాని,కె.పి. అశోక్ కుమార్, యు.అప్పలరాజు, ఎం.జయదేవ్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

https://www.dishadaily.com/telangana/hyderabad/both-objects-and-sculptures-are-necessary-for-literary-criticism-223231


నమస్తేతెలంగాణ_* దినపత్రిక, 19.6.2023 సౌజన్యంతో 

*_సాక్షి_* దినపత్రిక, 19.6.2023 సౌజన్యంతో 

దిశ దినపత్రిక, 19.6.2023 సౌజన్యంతో 

దిశ దినపత్రిక సౌజన్యంతో 




నమస్తే దినపత్రిక, 20.6.2023 సౌజన్యంతో 



సాహిత్య విమర్శకుడికి ఆ రెండు అవసరం https://www.newsbyte.net/?p=2895

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి