31 జులై, 2022

మాచర్ల డిగ్రీ కళాశాల అంతర్జాతీయ సదస్సులో ఆచార్య దార్ల సమాపనోత్సవ ప్రసంగం





*తెలుగు కవులది సామాజికతను వీడని చైతన్యం*

  • ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్య


తెలుగు కవులు ఏనాడూ తామ నివసిస్తున్న సమాజాన్ని దాని ప్రభావాన్ని విడిచిపెట్టి తమ రచనలను చేయలేదని అయితే అవి ఆయా సామాజిక వర్గాల నుండి వచ్చిన వారి స్వీయ అనుభవాల నుండి ఆ రచనలు వెలువడ్డాయని హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లా మాచర్ల లోని ఎస్ కే బి ఆర్ కళాశాల వారు  తెలుగు సాహిత్యం సామాజికత అనే అంశంపై రెండురోజులుగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ముగింపు సమావేశంలో శనివారం నాడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని సమాపనోత్సవ ప్రసంగాన్ని చేశారు.

ముగింపు సమావేశానికి సదస్సు సంచాలకులు డా.గుంటుపల్లి గౌరి అధ్యక్షత వహించారు. ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూతన విద్యా విధానం అమలు చేస్తున్న ఆధునిక భారతదేశ నిర్మాణంలో మల్టిడిసిప్లినరీ విధానంలో తెలుగు సాహిత్యం సమాజానికీ ఒక మార్గనిర్దేశం చేసేలా ఉందని ప్రశంసించారు. ఈ సమావేశంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.జె.లక్ష్మీకుమారి,  ఆచార్య విస్తాలి శంకర్రావు( మద్రాసు విశ్వవిద్యాలయం), ఆచార్య జె.వి.రమణ ( మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం),  అమెరికా నుండి  తానా మాజీ అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్, ఇంగువ మాధవి, డిల్లీ విశ్వవిద్యాలయం నుండి డా.గంపా వెంకట్రామయ్య, యాం.శారద, డా.బెజవాడ సుబ్బారావు, హిందీ అధ్యాపకులు బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి