▼

31 మార్చి, 2020

కీ.శే.దార్ల అబ్బాయి గారి స్మృతిలో...


     కీ.శే. దార్ల అబ్బాయి గారి స్మృతిలో...
సీ॥ కౌమారదశనుండి ప్రేమానురాగాలు
           పంచి పెంచిననాన్న! ప్రణతులయ్య!
    జ్ఞానసుగంధమున్ నయముగా నందించి
            వృద్ధినొందించిన విబుధవర్య!
    సకుటుంబ సభ్యులన్ సంస్కారమందించి
             యున్నతశిఖరాల నుంచి నావు
    దీపమై మాకెల్ల దివ్యకాంతినొసగి
                సన్మార్గమున నిల్పి సాగినావు
తే॥ నేడు వర్ధంతి కైమేము నిక్కముగను
       బంధువర్గాలతోకూడి  భక్తితోడ
       స్మరణ చేయగా నేతెంచ సాగుచుండ
       నీచమైనకరోనము నిలువరించె
     - గోవిందుని గోవర్ధన్ 30.3.2020
(మా మిత్రుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు గారి నాన్న గారు దార్ల అబ్బాయి గారి స్మృతిలో....)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి