▼

13 సెప్టెంబర్, 2018

చక్కగనుండుము సభలో...! (నేటినిజం సౌజన్యంతో)

చక్కనివేషముకలిగీ
చక్కని భాషను పలుకుము చమతృతిగానూ
యె
క్కువ తక్కువ చేయకు
ఒక్కరెవరినైనసభను వరమౌ దార్లా! 


విడువకుమీసభలోపల
విడువడననుబంధములనువీనులకెపుడూ
జ
డులేకురిసినపరుచుము
యెడబాయనియెదముదమునయెపుడూదార్లా! 


త
డబడనీయకు మాటను
విడువకునైతికవిలువలువిజయముకొరకున్
స
డలకుధైర్యమునెపుడూ
కడలి కెరటములను చూసి కలగను దార్లా! 


తె
లిసినదానినిపలుకుము
తెలిసినదంతయుపలుకకుతెలివేలేకన్
త
లచుకొని కలుసుకొనవలె
తెలిసిన పెద్దలనువీడ్వకెన్నడు దార్లా! 


 మరువుముతిట్టినతిట్టులు
మరువుముకొట్టిననుగానిమరతుముయన్నీ
మ
రువకుకరుణాశీలిని
మరువకుపెట్టినమెతుకులుమాత్రముదార్లా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి