▼

18 ఏప్రిల్, 2018

తొలివలపు


మనసుమబ్బులో మెరుపులు మెరిసినట్లు
ముట్టుకొనగానుషాకునే కొట్టినట్లు
కళ్ళు మూసినా నీరూపు కనులనుండు
యేమి జేసితివేనువ్వు యెదను చేరి?


ఇంత మందియునున్ననూ  నిన్నె తలుతు
నింత మందిపొగిడినను  నీదె నిలుచు
నింత మందియెగబడిన  నిన్నె పిలుతు
నింతగానెందుకిష్టమై  నిలిచినావు?


ఆ క్షణమంతయు మధురము
నా క్షణమంతయునమరము నాతమకంబున్
ఆ క్షణమందినసుఖమును
నా క్షణమును మరువటయునసాధ్యముదార్లా!


కనులన్నితెరచియున్నను
కనపడదేమియు నొకరికొకరుతప్ప మరే
మనలేరేవ్వరు జంటను
పనులెన్నిజరగవలసిన పట్టవు కదరా!




-దార్ల వెంకటేశ్వరరావు
18 ఏప్రిల్ 2018

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి