09 సెప్టెంబర్, 2017

జీవుని పయనం

మబ్బులు మనకంతుచిక్కవు
గడియగడియకో రూపాన్నిస్తాయ్ 
మబ్బుల పయనమెటో 
మనమూహించలేం!
ఏమబ్బు ఏమబ్బులో 
ఎందుకు కలిసిపోతుందో 
ఎవరికి తెలుసు ?
పంచేంద్రియాలకందని 
మనసు చేసే మాయాజాలమంతా 
మబ్బులూ చేస్తుంటాయో 
ఆకాశానికీ అర్ధంకాని 
ఆ మబ్బులు చేసే మర్మాలన్నీ 
మనసూ చేస్తుందో! 
మబ్బు కీ మనసుకీ
ఆకాశానికీ దేహానికీ 
ఆయెడతెగని బంధమేంటో ?

- దార్ల

(మిత్రమా! ఈ కవితలో... సాలీడు, గూడు అనేవి ప్రతీకలు. జీవన్మరణ సమస్య ఏర్పడినప్పుడు, ఆ జీవి తన పంచేంద్రియాల ప్రతిస్పందను తనదేహం ద్వారా తెలుసుకుంటుంటాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే పంచభూతాల్ని తనదేహంలోనే ఉన్నాయనీ అర్దం చేసుకుంటాడు. ప్రకృతి తత్వాన్ని అర్ధం చేసుకునే  అన్వేషణను ప్రారంభిస్తాడు.  దేహంలో జీవి లేదా ప్రాణం నిలవాలంటే తాను ఆశ్రయించుకున్న శరీరాన్ని కాపాడుకోవాల్సిందేననుకుంటాడు.  అటువంటప్పుడు 'ప్రాణి' పొందే సంఘర్షణను ఈ చిన్ని కవితలో వర్ణించే ప్రయత్నం చేశాననుకుంటున్నాను....దార్ల)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి