12 అక్టోబర్, 2006

" కొన్ని మినీకవితలు!"


ఏదో చల్లని స్పర్శ
ఘనీభవించిన
మౌనం
ప్రవాహమై ఉరుకుతోది!

2. నీడనివ్వడానికి
చెట్టు పిలిచింది
విశ్రమించినతర్వాత
నీడనే లేకుండా చేశాడు!

3. నిద్దరికీ తెలిసిపోయింది
ఇద్దరిమధ్యా
ఎడబాటందుకని
ఎటో వెళ్ళిపోయింది!

4. తెలవారడం లేదు
బిగికౌగిట్లో
సూర్యుణ్ణి కమలిని ఇంకా విడిచిపెట్టలేదేమో!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి