దార్ల శతకము

1.    శ్రీగణపతి దేవ! శివపార్వతీ పుత్ర! 
నీదు దయను పొంద నిన్ను తలతు
పద్యవిద్య సుజన హృద్యంబు చేయరా !
దారి పూల తోట దార్ల మాట! 

2.    న్యభాషలైన అంటరానివికాదు
పద్యమైన నదియు గద్యమైన 
ప్రజల భాష నాది ద్యశతకమైన 
దారి పూల తోట దార్ల మాట! /

3.    కప్పలన్నికలిసి చెప్పలేనంతగా
ర్షమొచ్చువేళ ర్షమొందు
న్నికలకుముందుయెంతహడావిడో! 
దారి పూల తోట దార్ల మాట!

4.    ద్యమించకుండ రించు ప్రకటన
లెన్నియోవెలువడు లెక్కలేదు
న్నికలకు ముందు యేదివద్ధనుకోర్టు 
దారి పూల తోట దార్ల మాట! 

5.    తాగికారునడుపప్పయినప్పుడు 
టువేయునపుడునోటునిచ్చి 
నకువేయమనుటప్పుకాదందురా
దారి పూల తోట దార్ల మాట! 

6.    ట్టుకున్న హాయి కాటనుచీరయే
పెట్టవలయు గెంజి పట్టుబట్టి 
ఉతికినప్పుడల్ల బతుకేమొ బేజారు
దారి పూల తోట దార్ల మాట! 

7.    రాత్రి సంచరించు రాక్షసులను మాట
కృతయుగమున చెల్లు లినియనిన
సాఫ్టువేరు వాళ్ళు చావగొట్టి విడుచు
దారి పూల తోట దార్ల మాట!

8.    ద్దనిన కుదరక చ్చిపడుచు నుండు
మునిసిపాలిటీల మురికి వోలె
వాట్స' పులుల గుంపు రమైన శాపంబు
దారి పూలతోట దార్ల మాట! 

9.    ప్పు, పసుపు, వేప న్నవనుచునమ్ము
హుళజాతి వాళ్ళు బాగుయనిన
మంచిదన్నచాలు నమంత సిద్ధమే 
దారి పూల తోట దార్ల మాట!

10. అమ్మ యనెడు మాట మృతంబు కురిపించు 
య్య యనెడు మాట ధైర్య మిచ్చు
మ్మిడాడియనెడు మాటలుయేలరా 
దారి పూలతోట దార్ల మాట!


11. బ్దమర్ధమెపుడు శంకరపార్వతుల్ 
లిసినిలువగలుగు వనమగుచు 
తకమొకటిచాలు క్తిముక్తియువచ్చు 
దారి పూల తోట దార్ల మాట!

12. వ్యాస కాళిదాస, వాల్మీకులాదిగా 
లరు కవులు భావుత్వనిధులు 
అద్భుతంబునిచ్చు సద్భుద్దికలిగించు 
దారి పూల తోట దార్ల మాట!

13. నిషిమేఘమైన నసెంత తేలిక 
నింగినిలుచు, మబ్బు నిలవదెపుడు
గిరివచ్చిచిలుక యేదోపలికిపోయె
దారి పూల తోట దార్ల మాట!

14. చిత్తమేమొమబ్బు చిత్రమోలెకదులు
అంబరంబుయెపుడు ట్లెనుండు
సత్యమిదియెపొందు నిత్యసంతోషంబు
దారి పూల తోట దార్ల మాట! 

15. తినగలిగిననాడు తిండిదొరకకుండు
తిండికలిగినాడు తినుట సున్న
తిరిపెమెత్తిశివుడు తిండివిలువచెప్పె
దారి పూల తోట దార్ల మాట! 

16. సాగిసాగినదులు సాగరంబునఁజేరు
సాగరంబులన్ని త్త్రి జేరు 
చిత్రమదియచూడ సృష్టి విధానంబు
దారి పూల తోట దార్ల మాట


17. శ్రీనివాసుడిచట సిరులను కురిపించు
కాణిపాకమందు ణపతియును
పుణ్యఫలములిచ్చు ధన్య రాయలసీమ
దారి పూల తోట దార్ల మాట! 
18. కావ్యహిమశిఖరము కాదనలేనిది 
నుచరిత్ర కథయు నకుదొరికె
రామకథకు మొల్ల రామాయణంబురా! 
దారి పూల తోట దార్ల మాట! 
19. లేచివచ్చునేమొ లేపాక్షిబసవన్న
రచి చూడు అద్భుతంబు, యెంత
వెతికినకనుమదియె వేలాడుశిలచూడు
దారి పూల తోట దార్ల మాట

20. రవునేలకాదు ళలకుపుట్టిల్లు
నరులుండె పసిడి జ్ర ఘనులు
రాగిసంగిటిరుచి రాయలసీమదే! 
దారి పూల తోట దార్ల మాట!

21. టలూరు పోతులూరితత్త్వజ్ఞాని,
రాజ్యమేలినట్టి రాయలుండె
రాళ్ళసీమకాదు తనాల సీమరా
దారి పూల తోట దార్ల మాట! 

22. వారసత్వమేల వంశపాలనయేల
ప్రజలసేవకొరకు దవులనుచు
పట్టుకున్నపదవి యట్టులేనుండురా
దారి పూల తోట దార్ల మాట!

23. తండ్రిపేరునొకరు ల్లిపేరొక్కరు
చెప్పుకొనుచుకీర్తి కప్పుకొనును
చెప్పెడిదియొకటగు చేయునింకొక్కటి 
దారి పూల తోట దార్ల మాట !
24. స్తిదాచుకొనెడి క్కు ప్రజలకన్న
ప్రభుతకున్నమిన్న బాగుయనుచు
వసరమునుబట్టి స్తినిచ్చినచాలు
దారి పూల తోట దార్ల మాట!

25. గుప్తనిధులు, ఘనులు గుర్తించగలిగిన
గుట్టువిప్పుయాప్పుగూగులమ్మ
నసువిప్పిచెప్ప నకది సాధ్యమా
దారి పూల తోట దార్ల మాట! 

26. కులముపేరనొకడు బలముందనునొకడు
మతమనింకొకుండు గతమనుచును
వేరొకుండునుండు వేర్వేరుగుటయేల? 
దారి పూల తోట దార్ల మాట !

27. నల్లధనము పోయి తెల్లధనమువచ్చె
వెయ్యివద్దు రెండువేలు ముద్దు
చిన్ననోటుకన్న మిన్నపెద్దదియేల? 
దారి పూల తోట దార్ల మాట! 

28. లిగిపోయెజనులు ల్ల ధనము పేర
నోట్ల రద్దువలన కోట్లకొలది
చావురాకబతికి న్యాసులయ్యేరు
దారి పూల తోట దార్ల మాట! 

29. పట్టపగలుదోచి నిట్టనిలువుముంచు
విజయమాల్య 'మోడి' విజ్ఞులుండు
బ్యాంకు వైపు పోకు బెంగయెక్కువగును 
దారి పూల తోట దార్ల మాట! 

30. టియమ్ములెన్ని యేర్పాట్లు కలిగించె
శునకములకునవియుసుఖమునిచ్చు
సేదతీర్చు డబ్బు చేరునంతవరకు
దారి పూల తోట దార్ల మాట!

31. ముందు తిండి పెట్టి మూతిని బిగియించు 
జీతమున్న బేంకు గీతగీయు
ట్టుగలిగినట్టి పాలన చూడరా
దారి పూల తోట దార్ల మాట! 

32. కొత్తనోట్ల వలన కోరివచ్చుననిరి
నోట్లు రద్దు చేయ కోట్ల కొలది
నల్లధనములేదు తెల్లధనములేదు
దారి పూల తోట దార్ల మాట!

33. ర్ధికవ్యవస్థ స్థవ్యవస్థంబు
రతదేశమంత భ్రష్టుపట్టె
జనులగోలనేడు ధనమంతయేమాయె
దారి పూల తోట దార్ల మాట!

34. నిద్ర లేచి మొదలు నిద్రపోవువరకు
మింగవలయు మాత్ర మిగలకుండ
బొజ్జనిండనవియు భోజనమునమించు
దారి పూల తోట దార్ల మాట!

35. రములన్ని నలిగి, యనమ్ములన్నియు
కరములన్నియడుగు శరణమనుచు
వరములిమ్మనరు షుగరు మాన్పమందురే
దారి పూల తోట దార్ల మాట! 


36. అడగకున్ననిచ్చునందరు సలహాలు
శాస్త్రవేత్తలేరి శాశ్వతముగ
ట్టు బెట్టవారు ధుమేహ జాడ్యంబు
దారి పూలతోట దార్ల మాట !


37. మృత్యువనిన జీవి నిత్యము భయపడు
నిషికెన్నడైన రణమొచ్చు
ముందు తెలియనదియె పొందైననరకంబు 
దారి పూలతోట దార్ల మాట !

38. తినకముందు నొకటి తిన్నప్పుడొక్కటి
పొడుచుకొనవలయును జడుచు కొనకు
నని చంపు సఖియె ధుమోహనాంగిరా
దారి పూలతోట దార్ల మాట !

39. దలుమెదులలేక నపడకుండాను
కాటువేయగలదు కార్పొరేటు! 
రుణయనెడిమాట పడనిచోటురా
దారిపూలతోట దార్ల మాట! 

40. సంతకంబుపెట్టు ర్జరీకనుచుండు
థలకథలగుట్ట కార్పొరేటు
బ్బుమాటకన్న బ్బుదేమాటరా
దారి పూల తోట దార్ల మాట!

41. స్తిపాస్తులన్ని రియించిపోయినా
తికియుండగానె చంపితినును
కార్పొరేటు యనెడి లియుగ రాక్షసి
దారి పూల తోట దార్ల మాట! 

42. సెలవులెందుకంటె సెప్పలేమనకండి
పిల్లలున్నచాలు పిలిచికెళ్ళి 
కార్పొరేటు కళలు నిపించిమురిపించు 
దారి పూల తోట దార్ల మాట!

43. సందువెతుకుకొనుచు ర్వరంగంబులు
వామనుండువోలె చ్చెనండి
మ్మగాను చెప్పు కార్పొరేటుకథలు
దారి పూల తోట దార్ల మాట! 

44. రదవోలెమనము దిలేజలమునండి
మంచినీరువలెను రలమనకె
చ్చునండి మార్చి ఇంకుడుగుంతలే
దారి పూల తోట దార్ల మాట! 


45. ఇంటికెళ్ళిచూడుల్లాలిముచ్చట్లు
ఇంటిచుట్టుకట్టుఇంతగుంత
ఇంటిపొదుపుతెలుపు ఇంకుడుగుంతులే
దారి పూల తోట దార్ల మాట! 


46. దాహమైనవారు దారంతవెతుకుచు
వెతికి పట్టు బావి వెతలు తీరు
నీటివాలునట్లెనిలుబెట్టిపట్టరా 
దారి పూల తోట దార్ల మాట!

47. విప్పియుంచకండి విచ్చలవిడిగాను
ళ్ళుతోమునపుడు ట్టనట్టు
ఎల్లవేళలందునల్లానుబిగియించు
దారి పూల తోట దార్ల మాట! 


48. గెడ్డమెపుడుగీయి నడ్డదిడ్డంబుగా
వ్యర్ధమేలనీళ్ళు దులచుందు
కొద్దినీళ్ళెకోట్లగొంతుతడిపెచూడు 
దారి పూల తోట దార్ల మాట! 

49. నీటి విలువతెలుపు నీకురాయలసీమ
కోరినంతనిచ్చు కోనసీమ
తెచ్చిపంచునెపుడదేభాగ్యనగరము
దారి పూల తోట దార్ల మాట! 
50. నుషులంతయొకటి ర్మంబువేరయా
ట్టియొక్కటైనమానువేరు
విత్తనంబుబట్టి వికసించుబుద్ధులు
దారి పూల తోట దార్ల మాట

51. నులనుండిమెరుపు కౌగలిచ్చువలపు
మాయలజలతారు, ధురవాణి
గరమంతమించుటనుండదెక్కడా! 
దారి పూల తోట దార్ల మాట!


52. ఫోనుతెరవగానె పొంగిపొర్లుచువచ్చు
నీతిబోధచేయు గీతలెన్నొ
నిత్యసత్యమదియె నీతియనుకొనేల! 
దారి పూల తోట దార్ల మాట!


53. నకుతెలియకుండ నపేరు ప్రచురించు
చన చూడ ముఖము రంగుమారు
వివరములను చూడు విస్తుపోకుందుమా? 
దారి పూల తోట దార్ల మాట!


54. కులము, మతములన్ని కుత్సతబుద్ధులు
లపవలయుగాని లహమేల? 
మంచికన్నమించు మానవత్వములేదు
దారి పూల తోట దార్ల మాట! 


55. యోగియయ్యెనొకడుభోగవిముఖడయ్యె
నొకడుతాత్వికుండునొక్కడయ్యె
డకుచిక్కినోడి న్మెంతమోక్షమో
దారి పూల తోట దార్ల మాట! 

56. వసరంబుమేర న్యభాషలయినా 
మాట లాడ వలయు రువవద్దు 
మాతృభాషయేను నకుజీవనమగు 
దారి పూల తోట దార్ల మాట!


57. ఊరికంతటికిని పేరేమొపెద్దమ్మ
ల్మషమునెరుగని రుణశీలి
న్నుకన్నతల్లి నాగమ్మపేరురా
దారి పూల తోట దార్ల మాట! 


58. పేరుపెట్టమనియు పెండ్లిపెద్దవనియు
పిలుచుకెళ్ళువారుతలుచువారు
మ్మనెపుడుకొలుచు మ్మవారందురే 
దారి పూల తోట దార్ల మాట!


59. లిమి లేములన్ని ష్టసుఖములట్లు
ల్లి దండ్రి యన్న మ్ములుండు
క్తబంధమదియె రాదిలసాటిరా
దారి పూల తోట దార్ల మాట! 


60. దనరంగమేల త్తిదూయుటయేల 
పద్యమైన కవిత గద్య మైన 
రసమవ్వవలయు తియకౌగిలివోలె
దారి పూల తోట దార్ల మాట! 


61. పొమ్మనెంతకొట్టు పొయ్యి వీడదుకుక్క
పోయిచూడుమరల పొయ్యినుండు 
చెప్పుతినెడికుక్కచెవికేలతాకురా
దారి పూల తోట దార్ల మాట! 


62. రాజకీయవేత్త రానున్నవేళకి
పాఠశాలనున్న బాలలేల? 
తేరగొచ్చెనేని తెమ్మందురెల్లరన్
దారి పూల తోట దార్ల మాట!


63. ప్రక్కనున్నవారి లుకులుకన్నను
పొద్దుపోకచేయు ఫోనుముద్దు 
దగ్గరున్ననేమి దుర్గతిపట్టునా? 
దారి పూల తోట దార్ల మాట! 64. క్షరముల పుష్పమాలనందించుచూ
సంతసమున నన్ను త్కరించె
గుండెనుందువయ్య! గురవయ్య! కవివయ్య! 
దారి పూల తోట దార్ల మాట! 
65. పెరుగు నేల బొజ్జ పెద్దవయసురాను? 
పుట్టిన పసిపాపకెట్టిదూది
రుపుకన్న పొట్ట దిలంబునుండురా 
దారి పూల తోట దార్ల మాట! 

66. శిలనుచెక్కిశిల్పి శిల్పముగమలుచు
ఠినహృదయమైన రుగునట్లు 
హృదయతనునింపు సాహిత్యపఠనంబు
దారి పూల తోట దార్ల మాట! 
67. ర్వవేళలందుసాహితీ పఠనంబు 
లినమవ్వువేళ నసునంత 
సంస్కరించిమనకు మదర్శనమునిచ్చు
దారి పూల తోట దార్ల మాట! 


68. ప్రా, యతుల జతలు ట్టించుకున్ననూ
గణముకన్ననిలుచు గుణముమిన్న
సహృదయునికదియెమణీయపద్యంబు
దారి పూల తోట దార్ల మాట!


69. నసుమెచ్చకున్ననవారిదైననూ
పొగడమన్నమనము పొడగలేము
మంచిరచనయైన రిచిపోలేమయా
దారి పూల తోట దార్ల మాట! 
70. లిమిలేములన్నికావడికుండలు
డిదుడుకులుతెలిపిర్పునిచ్చి
త్వగుణమునేర్పు సాహిత్య పఠనంబు 
దారి పూల తోట దార్ల మాట! 

71. విద్యనిచ్చునాత్మవిశ్వాసమొకనాడు
కార్పొరేటువిద్య లలు త్రుంచి
విద్యపేరుచెప్పివిసుగెంతపెట్టురా
దారి పూల తోట దార్ల మాట!

72. నసుశాంతిగున్న ధురంబుభాషయు
కోపమున్నవేళ 'కొత్త' భాష
భావనెట్టిదైన భాషయటులెనుండు! 
దారి పూల తోట దార్ల మాట! 

73. సూటువేయునతడు చుట్టుకావలినుండు
ముందునడుచునంత ముఖ్యుడవడు 
మెరుగుకన్నవిలువ మేధావి కుండురా
దారి పూల తోట దార్ల మాట!

74. వెతుకువెతుకువెతుకు బ్రతుకంతయువెతుకు
వెంటబడుచు వెతుకు వెలుగు కొరకు 
వెతుకు యుగ యుగముల వెలుగుబాట వెతుకు 
దారి పూల తోట దార్ల మాట! 


75. ళితుడెంతయున్నపదవినుండినా
కులము కర్మవలన కూర్మిలేదు
రతభూమినందు భాగ్యంబు చూడరా! 
దారి పూల తోట దార్ల మాట! 


76. మ్మనాన్నలనిన దరింతుముగాని
న్నిదక్కినంతవతలుండు
విత్తుబట్టిమొలుచువిలువైనమొక్కలు
దారి పూల తోట దార్ల మాట! 


77. పాండితీ ప్రకర్ష ప్రకటించుకొనుటకు
ర్ధ మవ్వనివ్వఱుచుచుండు
ధిపత్యభావజాలమటులెనుండు
దారి పూల తోట దార్ల మాట! 

79. ' చారు' నెవ్వరయ్య రి' చారు'? రుచిచూడ
విడివరెవరు 'చారు' విస్తరున్న
నసు నున్న 'చారు' తివోలె తలి' చారు' !
దారి పూల తోట దార్ల మాట! 

80.  గుండు నిట్లు మిగిలె గుట్టునేతెలుపుచు
బోల్డుహెడ్డుకున్నభోగమేమి
దువ్వెనెన్నిమార్లు దువ్వుదురదతీర్చు
దారి పూల తోట దార్ల మాట!

81. పిలవకున్న వచ్చు ప్రియమైన శత్రువు
పోనువెనుకకనుచు పోరుపెట్టు
చెప్పనేలబొజ్జ చెలిమైనశత్రువే! 
దారి పూల తోట దార్ల మాట! 

82.  వేసవి సెలవులకు వెళ్ళితినూరుకి
క్కబోసిచంపె రునందు 
న్నిమరచిపోతి మ్మనుచూడగా
దారి పూల తోట దార్ల మాట!

83.  ప్రజలభాషలేమి ట్టించకోనట్టి
విద్యపేరవిర్రవీగువాడు
సూత్రమనినయేమిచూసుకొనేడ్వరా
దారి పూల తోట దార్ల మాట! 

85. లవకుండనెంతకాలముంచగలవు
మాలమాదిగలను మాయచేసి
లదురెచ్చగొట్టుర్గీకరణ నేడు! 
దారి పూల తోట దార్ల మాట! 

86.  గ్యాసువచ్చునేమొ కాఫీలువద్దులే
కొవ్వు పెరుగునేమొ కొన్నివద్దు
తకలేడుమనిషి యపడుచచ్చునే
దారి పూల తోట దార్ల మాట! 

87. మ్ముకున్ననేల మ్మలాభావించు
పేదవాళ్ళయిళ్ళు 'పెద్ద' వాళ్ళు
మాటలాడకుండ మాయముచేయునే! 
దారి పూల తోట దార్ల మాట! 88.  తెల్లదొరలు పోయి నల్లదొరలువచ్చె
మారవలయుముందునిషిమనసు
దేశమేదియైన దేవళంబౌనురా
దారి పూల తోట దార్ల మాట! 

89.  మారుతున్నకాలపరిణామగతులన్ని
కనుటలేదుకవులువినుటలేదు
తుడిచివేసినట్టి 'తురక' లనుటయేల? 
దారి పూల తోట దార్ల మాట! 

90.  లనశీలకవులు 'చండాల' మనుటేల
ధిపత్యమున్నట్లెపిలుచు
నసుపొడుచునట్లుమాటపలుకుటేల
దారి పూల తోట దార్ల మాట! 

91.  గాజులేసుకున్న డంగివాడిలా
ఇంటినొదలలేకయుంటివనుచు
లినపరుచుకొనెడిమానవతులునుండె! 
దారి పూల తోట దార్ల మాట! 

92. అందనంతయెత్తునాకాశముండెనా
ఉండియుండనట్లునుండగలదు
నిషికీర్తియటులుమాయలుచేయునే
దారి పూల తోట దార్ల మాట! 

93. టులవచ్చివీచునెటులపోయినగాని
వాయువున్నమనకుహాయికలుగు 
నపడీకనపడకాప్రాణములునిల్పు
దారి పూల తోట దార్ల మాట! 

94. రులన్నిపారియెచ్చటకలియును? 
సాగరమునచేరిశాంతినొందు
మానవుండుమరల ట్టినటులెచేరు
దారి పూల తోట దార్ల మాట! 

95. ర్షణమునపుట్టు ర్షణమునపోవు
గ్నిగుణముకున్న అంతమదియె
ర్షణంబుజన్మ ర్షణే మరణంబు
దారి పూల తోట దార్ల మాట!

96. స్ఫర్శ, రూప, రసము, బ్ధగంధాలను
విషయములనిపిలుచువిశ్వమెల్ల
దమటునిటుగానిరమాత్మరూపమే! 
దారి పూల తోట దార్ల మాట! 97.  ప్పుచేయువాడుప్పుకొనుచునుండు
కాంతిహీనమౌను నులుకనుము
నీతికలిగెనేని నీవైపెచూడడా? 
దారి పూల తోట దార్ల మాట!98.  లేవులేవనినవిలేచివచ్చినవేమి
నాలుగేళ్ళుకళ్ళు కానలేదు
ప్పుడెట్లునిజము ద్యోగములునిచ్చు? 
దారి పూల తోట దార్ల మాట!99.  న్నిమార్చగలుగుధికారమున్నచో
ముందునున్నవన్ని మూలకేసి
నదుముద్రవేయ తంతుజరుగునంతె! 
దారి పూల తోట దార్ల మాట! 100.న్నవాటివిలువ న్నప్పుడుతెలీదు
తిండిలేనినాడుతిండివిలువ
రిగిపోవతెలియునారోగ్యమువిలువ
దారి పూల తోట దార్ల మాట!101 సీరియళ్ళుచూడు చిత్రవిచిత్రము
మూసపోసినట్లు మూల్గుచుండు 
తికివదలకుండుతివలకండ్లురా
దారి పూల తోట దార్ల మాట! 102.విశ్వరూపుచూప వివరించుచుండెనే 
త్మగౌరవమని రుచుచుండె
వితనందుతప్పకాళ్ళుమొక్కేలరా
దారి పూల తోట దార్ల మాట! 103. భావజాలమనుచు బాధుకొనుటయేల
చరించునపుడు దియెవిలువ
మంచి రచన విలువనిషితనంబురా
దారి పూల తోట దార్ల మాట! 
104.  దువుకైనగాని చంటిబిడ్డలనుచు
సతిగృహమునందుదులువేళ
రుణహృదయులంతదలిపోకుందురా
దారి పూల తోట దార్ల మాట! 105. దిశాశ్వతమగు? యేదశాశ్వతమగు? 
నిన్ననేటికేది? మొన్న యేది? 
ల్లిదండ్రులన్నమ్ములంతాభ్రమ! 
దారి పూల తోట దార్ల మాట!


106. ఎందుకొచ్చినావు? యెందుకుపోవలె? 
మతలేల? మరలరణమేల? 
నీటిబుడగవోలెనిత్యమునుగులేల? 
దారి పూల తోట దార్ల మాట!


107.      త్తములకు కోపముండునోక్షణమది
ధ్యమాధములకు మాత్రముండు
డియ, దినము పాపిదిమరణాంతంబు! 
దారి పూల తోట దార్ల మాట! 


107.              వ్యాకరణములేని వాజ్ఞ్మయాధ్యనమును
థ్యమేలననెడి షధమును 
గిలినట్టి పడవ ట్టినపయనంబె! 
దారి పూల తోట దార్ల మాట!


108.              వినెడివానియెదుట విన్నవీకన్నవీ
లిపిచెప్పవచ్చు థలు కథలు
నిజముతెలుసునెపుడు నిలకడమీదనే
దారి పూల తోట దార్ల మాట! 


109.      నీటిమునిగినట్టినీటిగడ్డనుచూడు
రచిచూడకుండగినదనకు
నసుమర్మమెపుడునకట్లునుండురా! 
దారి పూల తోట దార్ల మాట!

110.      నోటికొచ్చినట్లు మాటలాడతగదు
మాటకున్నవిలువరువరాదు
రచువారు ప్రజల నసులో నుండునా?
దారి పూల తోట దార్ల మాట! !


111.      క్కడుంటిమయ్య యేమిబ్రతుకులయ్య! 
యెఱుకలోళ్ళుయనుచు యెట్లు తిట్టు? 
జాతినట్లుతిట్ట జాగృతేలేదురా! 
దారి పూల తోట దార్ల మాట! !


112.      ' మంటకలిసిపోయెమానవహక్కులు' 
మాటమాటకనెడినుషులేరి? 
జాతికొక్కనీతి జాడ్యంబులేలరా! 
దారి పూల తోట దార్ల మాట! !


113.      త్తములకు కోపముండునోక్షణమది
ధ్యమాధములకు మాత్రముండు
డియ, దినము పాపిదిమరణాంతంబు! 
దారి పూల తోట దార్ల మాట! 

114.      వ్యాకరణములేని వాజ్ఞ్మయాధ్యనమును
థ్యమేలననెడి షధమును 
గిలినట్టి పడవ ట్టినపయనంబె! 
దారి పూల తోట దార్ల మాట! 

115.      వినెడివానియెదుట విన్నవీకన్నవీ
లిపిచెప్పవచ్చు థలు కథలు
నిజముతెలుసునెపుడు నిలకడమీదనే
దారి పూల తోట దార్ల మాట!

116.      నీటిమునిగినట్టినీటిగడ్డనుచూడు
రచిచూడకుండగినదనకు
నసుమర్మమెపుడునకట్లునుండురా! 
దారి పూల తోట దార్ల మాట!

117.      నోటికొచ్చినట్లు మాటలాడతగదు
మాటకున్నవిలువరువరాదు
రచువానినెవ్వరాదరించగలరు? 
దారి పూల తోట దార్ల మాట! !


118.      క్కడుంటిమయ్య యేమిబ్రతుకులయ్య! 
యెఱుకలోళ్ళుయనుచు యెట్లు తిట్టు? 
జాతినట్లుతిట్ట జాగృతేలేదురా! 
దారి పూల తోట దార్ల మాట! !


119.      'మంటకలిసిపోయెమానవహక్కులు' 
మాటమాటకనెడినుషులేరి? 
జాతికొక్కనీతి జాడ్యంబులేలరా! 
దారి పూల తోట దార్ల మాట! !


120. బిగ్గుబాసునేడు బిగికౌగిలిలగూడు
     సిగ్గుయెగ్గులేదుసిన్నబోవ
యెంతరెచ్చిపోయినంతరేటింగురా
దారి పూల తోట దార్ల మాట!
121.                     అంతుపంతులేని శ్చర్యకథనాలు
వెతుకవద్దు నెట్టు 
వెగటు పుట్టు
నేతిబీరకాయనెయ్యినిచ్చునటయ్య! 

దారి పూల తోట 
దార్ల మాట!
122.                     చిరుతబోలునట్టి పరుగుపెట్టునడక
చీమచావనట్టిసిన్నినడక
డకనడకచూడలుబదితీర్లయా
దారి పూల తోట 
దార్ల మాట!
123.                     నసుతేలిపోయెబ్బుకదిలినట్లు
కనులుతడిపిపోయెచినుకులన్ని
బాధతీరిపోయెరువేలనుండురా! 

దారి పూల తోట 
దార్ల మాట! !
124.                     మ్మ మాటవోలెమృతంబుకురిపించు
వన మధురిమలకు 
గన గంగ
తెలుగు భాష భువిని 
దిక్కులన్ని నిలుపు
దారి పూల తోట 
దార్ల మాట! 
125.                   కులముకన్నమిన్నగుణమనుచుందురు
చరించునపుడు 
దియునిజము
వానచినుకుతెలుపు 
ర్ణ ధర్మంబురా! 
దారి పూల తోట 
దార్ల మాట!
126.                     రూపుకట్టినట్టియపురూపబతుకమ్మ   
న్నిచోట్లనామెట్లెనుండు
మెబోనమెత్తివతారమూర్తిరా! 
దారి పూల తోట దార్ల మాట! !
127.                     క్కచెల్లితమ్మున్నదమ్ములగుడి
మ్మకరుణనున్ననాన్నకరకు
మతలల్లుకున్నమంచియిల్లగునురా
దారి పూల తోట 
దార్ల మాట! 
128.                     ప్రాణమెట్లుపోవుట్టుకొనగలమా
రకేలచింత 
నికి కొరకు
వానచినుకుబోలు 
మానవజన్మరా
దారి పూల తోట 
దార్ల మాట!

129.                     నాదినాదియనిన వ్వుకొనునుమట్టి
మట్టిపట్టినోటఁబెట్టరెవరు
మట్టినందెమనిషిగిట్టకపోవునా? 

దారి పూల తోట 
దార్ల మాట! 

130.                     కాదు కాదు నీది కావ్యంబు కాదురా
కావు కావు నువ్వు 
వివి కావు
కాకి గ్రుడ్డు కాకి 
కాకకోకిలగునా
దారి పూల తోట 
దార్ల మాట!


131.                     ముక్కలన్ని కలిపి ముడివేసినట్లుగా
గాలిపటమువోలె 
బ్రతుకుసాగ
యెంతకాలమెగురునేమితెలుసునయ్య! 

దారి పూల తోట 
దార్ల మాట!


(ఛందోబద్దంగా రాసే పద్యాలన్నీ అభ్యాసం కోసం రాస్తున్నవే. దీన్ని బట్టి నా దృక్పథాన్ని, నా పాండిత్యాన్ని మూల్యాంకన చేసే ప్రయత్నం చెయ్యొద్దని మనవి. ఇవి సరదాగా రాస్తున్న పద్యాలు. నా సీరియస్ భావాలన్నీ వ్యాసం, వచనకవిత్వంలోనే ఉంటాయని గమనించవలసినదిగా కోరుతున్నాను... మీ దార్ల వెంకటేశ్వరరావు)

No comments: