"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

19 November, 2017

‘శ్రీ సుగమ్ బాబు ‘రెక్కలు’ - సాహితీ సమాలోచనం’ విశేషాలు

నేటినిజం సాహిత్యానుబంధం, 23 నవంబర్ 2017 

సభోలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

రెక్కలు కవిత్వం అనుభవంతోపాటు ఆలోచనాత్మకంగా ఉంటుందని ప్రముఖ సాహితీవేత్త పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలుగులో మూర్తి దేవి పురస్కారం పొందిన ఏకైక సాహితీవేత్త , శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ అన్నారు. శనివారం (18 నవంబర్ 2017) సాయంత్రం హైదరాబాదులోని శ్రీ త్యాగరాయ గానసభలో ‘‘శ్రీ సుగమ్ బాబు రెక్కలు -సాహిత్య సమాలోచనం’’ సాహిత్య కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు మాట్లాడారు. రెక్కలు కవితా ప్రక్రియ ఆధునిక సాహిత్యాన్ని సుసంపన్నం చేసిందని ఆయన అన్నారు. రెక్కలు కవిత్వం సాహితీ ప్రక్రియలో గల నిర్మాణ వైవిధ్యాన్ని,దానిలోని తాత్వికతను ఆయన వివరించారు. ఈ కవితా ప్రక్రియను సృష్టించిన సుగమ్ బాబుగారిని ఆయన అభినందించారు. నిజానికి రెక్కలు కవిత్వం గురించి ఒక రోజు సమావేశం సరిపోదని దీనిపై మరింత మందితో లోతుగా చర్చించాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని ఆయన సూచించారు. రెక్కలు కవిత్వం గురించి మాట్లాడిన డాక్టర్ తిరునగరి, ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుని ముద్దుపెట్టుకుని మరీ అభినందిస్తున్న ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు

ఈ సమావేశానికి ప్రముఖ సాహితీవేత్త రమణ వెలమకన్ని అధ్యక్షత వహించారు. అధ్యక్షుడు సభను చక్కగా నిర్వహించారు. ఈ సాహితీ కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నిర్వహించిన జెల్లి విద్యాధర రావు గార్ని సభలోని అందరూ ప్రశంసించారు. పోలీసుశాఖలో చాలాకాలం పని చేసి పదవీ విరమణ పొందిన తర్వాత చక్కని కవిత్వం రాస్తున్న పెదూరి వెంకదాసుగారు వక్తలను పరిచయం చేశారు. సాహితీకిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు, శ్రీ త్యాగరాయగానసభ అధ్యక్షుడు   కళా వి.ఎన్. జనార్దనమూర్తి అతిథులుగా పాల్గొన్నారు.
ప్రధాన వక్తలుగా విచ్చేసిన డాక్టర్ తిరునగరి రెక్కలు కవిత్వం నిర్మాణం గురించి సోదాహరణ ప్రసంగం చేశారు. తెలుగులో ప్రాచీన సాహిత్య నుండి ఆధునిక సాహిత్యం వరకు వచ్చిన అనేక సాహితీ ప్రక్రియల గురించి ఆయన వివరించారు. రెక్కలు కవిత్వంలో ఆరు వచనాలు వుంటాయని మొదటి నాలుగు ఒక అంశాన్ని ప్రతిపాదిస్తే చివరి రెండు వచనాలు దానికి తాత్వికతను తెస్తుందన్నారు. ఆ చివరి రెండు వచ్చినా లెక్కలు కవిత్వానికి నిజమైన ప్రాణాన్ని పోస్తాయని ఆయన అన్నారు.
                               
సభలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 
'రెక్కలు కవిత్వం - సాహిత్య స్థాయి' గురించి మాట్లాడిన మరో ప్రధాన వక్త, డిప్యూటీ డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యుడు దార్ల వెంకటేశ్వరరావు రెక్కలు కవిత్వంలో గల శక్తే దాని సాహిత్య స్థాయిని  తెలుపుతుందన్నారు. ఏ సాహిత్య ప్రక్రియకైనా దానిలో వస్తువు, నిర్మాణ వైవిద్యం, అభివ్యక్తి, అనుభూతి రమ్యత అనే నాలుగు లక్షణాలూ ముఖ్యం అవుతాయన్నారు. భరతుని  మొదలుకొని ఆధునిక  విమర్శకుల వరకు  సిద్ధాంతీకరించిన సాహిత్య సూత్రాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణంగా ఎలాంటి సాహిత్య ప్రక్రియ ఎప్పుడు రావాలో ఆనాటి సామాజిక అవసరాలే వాటిని ఆవిర్భవించేలా చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. సుగమ్  బాబు రాసిన రెక్కలు కవిత్వంలోని సాహిత్య  తాత్వికతను, అందుకోవలసిన సాహిత్య స్థాయిని వివరించారు. (పూర్తి ప్రసంగాన్ని ఈ కింది లింకులో చదువుకోవచ్చు.)


సభకు ముందు ఆచార్య కొలకలూరి ఇనాక్, శ్రీ సుగమ్ బాబుగార్ల తో దార్ల 


సభలో మాట్లాడుతున్న ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు 

జెల్లి విద్యాధరరావుగార్ని సత్కరిస్తున్న దృశ్యం

ఈ సమావేశం జరగడానికి ముందు కవి‌ హనుమంతరావు గారి అధ్యక్షతన రెక్కలు కవి సమ్మేళనం జరిగింది.  సమావేశంలో పాల్గొన్న అతిథులు, వక్తలతో పాటు కవులను కూడా సత్కరించారు. చక్కని సాహితీ కార్యక్రమాన్ని చేసిన ఈ కార్యక్రమ నిర్వాహకుడు, విమల సాహితీ సమితి అధ్యక్షుడు నెల్లి విద్యాధరరావుగార్ని అందరూ అభినందించారు.
సుగమ్ బాబుగార్ని సత్కరిస్తున్న దృశ్యం

కవి శ్రీ సుగమ్ బాబుగారితో తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగుశాఖాధ్యక్షురాలు             డా.ఎం.మంజుశ్రీ, పరిశోధక విద్యార్థులు బి.ఉమేశ్, ఎం.చంద్రమౌళి, మస్తాన్, కవిగారి మనవరాలు

ఆచార్య కొలకలూరిఇనాక్,  శ్రీ సుగమ్ బాబు, శ్రీ విద్యాధరరావు, శ్రీరమణ వెలమకన్ని, ఆచార్య దార్లవెంకటేశ్వరరావు, డా.మంజుశ్రీ, ఉమేశ్, చంద్రమౌళి, మస్తాన్ తదితరులతో... ఈ దృశ్యం.

ఫోటోల సౌజన్యం: చంద్రమౌళి, అల్లూరిమస్తాన్


No comments: