"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

08 January, 2017

అంతర్జాలంలో తెలుగు సాహిత్యం- జాతీయ సదస్సు (జనవరి 11, 2017)

రాజమహేంద్రవరంలో జనవరి 11, 2017 న జాతీయ సదస్సు జరుగుతోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సాహిత్య పీఠం, బొమ్మూరు వారు మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమి (విహంగ డాట్ కాం) వారి ఆధ్వర్యంలో ఈ జాతీయ సదస్సు జరగబోతోంది. ఈ సదస్సులో ‘‘ అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’’ తీరుతెన్నుల గురించి సుదీర్ఘంగా చర్చిస్తారు. 

ఆహ్వానం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 
సాహిత్య పీఠం, బొమ్మూరు - రాజమండ్రి
మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమి (vihang.com) ఆధ్వర్యంలో
‘‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’
జాతీయ సదస్సు
జనవరి 11 - 2017 ఉదయం గO. 10.00 లకు
వేదిక: గోష్ఠి మందిరం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం-బొమ్మూరు
ప్రారంభ సభ
ఆహ్వానం :
ఎండ్లూరి మానస - పరిశోధకురాలు
సభాధ్యక్షులు :
ఆచార్య ఎండ్లూరి సుధాకర రావు-పీఠాధిపతి, సాహిత్యపీఠం
ముఖ్య అతిథి :
ఆచార్య ఎస్వీ .సత్యనారాయణ, ఉపాధ్యక్షులు, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం
విశిష్ట అతిథులు:
ఆచార్య జి. యోహాన్ బాబు ప్రత్యేక అధికారి ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం, విజయనగరం
విశిష్ట అతిథులు :
శ్రీ పట్టపగలు వెంకట్రావు అనంతసేవానికేతన్ వ్యవస్థాపక అధ్యక్షులు
శ్రీమతి పట్టపగలు అనంత రామలక్ష్మి-అనంతసేవానికేతన్ వ్యవస్థాపక కార్యదర్శి
అవగాహన పత్రం :
పుట్ల హేమలత - ఇన్ష్ట్రక్టర్, సాహిత్యపీఠం
వందన సమర్పణ :
రాచర్ల గౌతమి - పరిశోధకురాలు
మొదటి సదస్సు: తెలుగు భాష -సాంకేతిక పరిజ్ఞానం - ఆవశ్యకత
అధ్యక్షులు : డా. దార్ల వెంకటేశ్వరరావు - రచయిత, సాహితీ విమర్శకులు అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం
రెండవ సదస్సు: డయాస్పోరా సాహిత్యం - వెబ్ సైట్లు, బ్లాగులు
అధ్యక్షులు; డా.ఇక్బాచంద్ - కవి.యండి,డిజిటల్ ప్లానెట్ టెక్నోసొల్యూషన్స్ బెంగుళూరు
భోజన విరామం
విహంగ సాహిత్యపత్రికవార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం
సమయం గం.2-30 నుండి గం, 3,00ల వరకు
ఆహ్వానం: ఎండ్లూరి మనోజ్ఞ - మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమి సభ్యులు
అధ్యక్షులు : డా. పుట్ల హేమలత - సంపాదకురాలు (విహంగ. కామ్) జాతీయ అధ్యక్షురాలు, ప్రరవే
సంపాదకవర్గ సభ్యులు, విహంగ ఆత్మీయ రచయితల అభిభాషణ:
ఆచార్య కాత్యాయనీ విద్మహే, కె.వరలక్ష్మి, ఆచార్య కొలకలూరి ఆశాజ్యోతి, ఆచార్య చల్లపల్లి స్వరూపరాణి, జాజల గౌరి, కుప్పిలి పద్మ, మెర్సీ మార్గరెట్, విజయభాను, పి. విక్టర్ విజయకుమార్, లక్ష్మి సుహాసిని, గుబ్బిట దుర్గాప్రసాద్, బొడ్డు మహేందర్ నిర్వహణ : అరసి, పెరుమాళ్ళ రవికుమార్
మూడవ సదస్సు: సోషల్ నెట్వర్కింగ్ సైట్లు - సాహిత్య చర్చలు
అధ్యక్షులు : పి. విక్టర్ విజయకుమార్ - రచయిత, విమర్శకులు ప్రెసిడెంట్, లార్డ్ ఇన్సాస్టక్టర్ ఇండస్టీగ్రూప్
నాల్గవ సదస్సు: అంతర్జాలంలో తెలుగు సాహిత్యపత్రికల కృషి అధ్యక్షులు : డా. షమీఉల్లా - ఉపన్యాసకుడు, ప్రభుత్వ డిగ్రీకళాశాల - ధర్మవరం
అయిదవ సదస్సు: అంతర్జాలంలో బాల సాహిత్యం
అధ్యక్షులు : డా. రెంటాల శ్రీ వేంకటేశ్వరరావు - ప్రముఖ విమర్శకులు
సమాపనోత్సవం
సభాధ్యక్షులు :
ఆచార్య ఎండ్లూరి సుధాకర రావు - పీఠాధిపతి, సాహిత్యపీఠం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం. రాజమండ్రి
విశిష్ట అతిథులు :
ఆచార్యకాత్యాయనీ విద్మహే - జాతీయ కార్యదర్శి ప్రరవే
ఆచార్యకొలకలూరి ఆశాజ్యోతి - తెలుగుశాఖ, బెంగుళూరు విశ్వవిద్యాలయము
ఆత్మీయ అతిథి:
డా. లంకా వెంకటేశ్వర్లు - డిస్టిక్ట్ర్ రిజిస్ట్రార్, ఆడిట్ - ఏలూరు సదస్సు
సమన్వయ కర్త : జ్యోతిర్మయి - పరిశోధకురాలు
ప్రశంసా పత్రాల బహూకరణ
వందన సమర్పణ :
మల్లిపూడి వనజ - పరిశోధకురాలు

సదస్సు డైరెక్టర్ :
ఆచార్య ఎండబ్లారి సుధాకర రావు, పీఠాధిపతి, సాహిత్యపీఠం
సదస్సు కన్వీనర్ :
డా. పుట్ల హేమలత ఇన్స్టక్టర్, సాహిత్యపీఠం

1 comment:

Unknown said...

ఆహ్వాన పత్రం Unicode లో అందించినందుకు కృతజ్ఞతలు గురువుగారు