"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

27 August, 2015

ciil, mysore - తెలుగు అనువాదాల సాహిత్య చరిత్ర నిర్మాణం పై వర్క్ షాప్ ( 20, 21 ఆగస్టు 2015)

తొలిసారిగా ciil, Mysore కి వెళ్ళాను. భారతీయ భాషానువాదాల చరిత్ర పై (on “History of Translation in Indian languages (Telugu) Phase-1”)  పై ఆగస్టు 20, 21 తేదీల్లో ఈ వర్క్ షాప్ ని నిర్వహించారు. దీనిలో నేను ‘తెలుగు దళిత సాహిత్యానువాదాల చరిత్ర’’ బృందంతో కలిసి పనిచేశాను. ఆ అంశాలను CIIL  వారు తీసుకొచ్చే పుస్తకంలో ప్రచురిస్తారు. వాళ్ళకి సమర్పించిన వ్యాసం ఇక్కడ అందించడం కుదడం లేదు. అవన్నీ కాపీరైట్ కి సంబంధించిన అంశాలు.  ఇక మైసూరు ప్రయాణం చాలా ఆహ్లాదాన్ని కలిగించింది. అనేక విశేషాల్ని తెలుసుకోగలిగాను. ముఖ్యంగా టిప్పుసుల్తాన్ బ్రిటీష్ వాళ్లతో పోరాడి తన ప్రాణాల్ని కోల్పోయిన స్థలాన్ని చూసినప్పుడు నా కేదో పూనకం వచ్చినట్లు అనిపించింది. ఒక క్షణం మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది. ఆ తర్వాత మైసూరు ప్యాలస్ ని చూశాను. వీటితో పాటు, చాముండీశ్వరి దేవాలయం, శ్రీ రంగనాథ దేవాలయం తదితర క్షేత్రాల్ని దర్శించాను. ఆవివరాలన్నీ దృశ్యాత్మకంగా రాసుకోవాలనిపిస్తోంది. సమయాన్ని బట్టి రాసే ప్రయత్నం చేస్తాను.
వర్కషాప్ లో పాల్గొన్న దృశ్యం

సర్టిఫికెట్ తీసుకొంటున్న దృశ్యం

వర్క్ షాప్ లో పాల్గొన్న వారితో కలిసి తీసుకున్న ఫోటో


వర్క్ షాప్ లో చర్చల సందర్భంగా తీసిన దృశ్యం
(ఈ ఫోటోల్ని తీసి పంపించిన  CIIL, Mysore వారికి ప్రత్యేక కృతజ్ఞతలు)

No comments: