తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’ అనే యు.జి.సి. వారి  ‘  మేజర్‌ రీసెర్చ్ ప్రాజెక్టుకి ఉపయోగ పడే సమాచారమేదైనా  మీ దగ్గర లభిస్తే  దయచేసి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. విలువైన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను  నా ప్రాజెక్టులోనూ, తర్వాత ప్రచురించే పరిశోధన గ్రంథంలోనూ  పేర్కొనడం జరుగుతుంది. నా చిరునామా: డా. దార్ల వెంకటేశ్వర రావు, అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ, సెంట్రల్ యూనివర్సిటి, గచ్చిబౌలి, హైదరాబాదు -500 046. నా మెయిల్:vrdarla@gmail.com నా ఫోను నెంబరు: 09989628049.

సీనియర్ జర్నలిస్ట్ హరినాథ్ గారికి ఉగాది పురస్కారం!

ప్రతి సంవత్సరం జ్యోత్స్న కలా పీఠం జర్నలిస్ట్ లకు ఇచ్చే ఉగాది పురస్కారాన్ని ఈ ఏడాది సూర్య దినపత్రిక సీనియర్ సబ్ ఎడిటర్ హరినాథ్ గారికి ఇచ్చి సత్కరించారు. హరినాథ గారికి నా శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను.



1 comments:

Anonymous said...

కలాపీఠం అని కావాలని రాయలేదనుకుంటా!!