"Voice of a Dalit: The Poetry of Darla Venkateswara Rao, Published by Prestige Books International, New Delhi, this book is available at Flifkart. ఎం.ఏ., విద్యార్థులకు మీ టైమ్ టేబుల్ ప్రకారం క్లాసులు జరుగుతాయి. మీ డిసర్టేషన్ కోసం అంశాన్ని త్వరగా ఎంపిక చేసుకోవాలి

04 October, 2008

తనకు జరిగిన సన్మానానికి కృతఙ్ఞతలు తెలుపుతున్న దార్ల!

డా//దార్ల వెంకటేశ్వరరావుకు భారతీయ దళిత సాహిత్య అకాడమీ 2007 సంవత్సరానికి డా//అంబేద్కర్ అవార్డ్ తో సత్కరించిన సందర్భంగా,3-10-2008 న దళిత స్టూడెంట్స్ యూనియెన్ , హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ వారు అభినందన సత్కారం చేశారు. ఈ సభలో ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ కమీషనర్ ఎ.విద్యాసాగర్, ప్రొపెసర్ వీణా శతృఘ్న, ప్రముఖ సామాజిక ఉధ్యమ కార్యకరర్త ఉ. సాంబశివరావు , డా//జి .నాగరాజు, ప్రవీణ్, దిగుమర్తి సురేష్,సుంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంగా డా//దార్ల వెంకటేశ్వరరావు తనకు జరిగిన సత్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడారు.



Felicitaion of Dr.Darla VenkateswaraRao @ Yahoo! Video



దార్ల తనకు జరిగిన సన్మానానికి కృతఙ్ఞతలు! @ Yahoo! Video

6 comments:

మాగంటి వంశీ మోహన్ said...

మాష్టారూ - అంతా బానే ఉంది కానీ, ప్రతి దానికి ముందు "దళిత" చేర్చటమే కొంచెం "ఇది"గా ఉన్నది..

అసలు ఆ పదార్ధం లేకపోతే పని జరగదా?

మనం చేసే పనిలో పస ఉండాలి కానీ, పెట్టుడు పేర్లలో ఏముంది?

ఆఖరికి స్టూడెంట్స్ యూనియన్లో కూడా "దళిత" పదం చేరిపోయింది అంటే బాధేసింది...మీరు మాష్టారు అయ్యుండి, ఇలాంటివి .......

బై ది బై - అసందర్భం కాకపోతే మీరు ఎంతగానో అభిమానించే ద్వా.నా.శాస్త్రి గారు మా మావయ్యే...:)...

కొద్ది రోజులు పోతే పళ్లు తోముకునే టూత్ పేష్టు, తినే అన్నానికి కూడా ఈ పెట్టుడు పేరు "బ్రాండ్ అంబాసిడర్" గా మారిపోతుందేమో....భళా ...

స్త్రీవాదం, దళితవాదం, బోడిగుండు వాదం అన్నీ వదిలిపెట్టి మానవతావాదం వైపు అడుగులు పడవా మనకి ? అసలు ఈ పదాలు వాడటం ఎంత అవసరం ? ఎవరికి ఉపయోగం? పేరు - ఆ పేరు తగిలించుకున్నంత మాత్రానే సాగర మథనం జరిగి అమృతం బయటికి వచ్చిందా? వస్తే ఎంతమందికి దక్కింది ? దక్కిన వాళ్లు దేవతలై ఇతరులకి ఎన్ని వరాలు ఇచ్చారు ?


ఈ మధ్య ఈ అనవసరమయిన పేర్లు ఉన్న "వాదాలు" ఎక్కడ చూసినా "ఇంతింతై దళితంతై" లాగా ఆవరించి కనపడుతుంటే.....


ఎప్పుడో ఏదో జరిగింది అని ఇప్పుడు బోరు తవ్వి బావిలో పడేసి ఈ నామం చేర్చి కుమ్మిస్తా అంటే...

ఇంతే సంగతులు చిత్తగించవలెను...

Naga said...

సంతోషం. శుభాకాంక్షలు.

మాలతి said...

మనః పూర్వక అభినందనలు స్వీకరించండి. ఎప్పుడో కానీ నిజంగా తగినవారికి సన్మానాలు జరగని కాలం. మీకు ఈ సన్మానం జరగడం నాకెంతో సంతోషంగా వుంది.
- మాలతి

మాగంటి వంశీ మోహన్ said...

ఇది డాక్టర్ దార్ల గారి మీద కోపంతో రాసింది కాదు అని విన్నవిం...ఇవి అన్నీ డాక్టర్ దార్ల గారినే అడిగాను అనుకుంటే పొరపడ్డట్టే...ఇవి ఈ వాదాలతో వేళ్లాడేవారందరికీ అని చిత్తగిం....


Pls see the following post....

http://janatenugu.blogspot.com/2008/10/blog-post_04.html

Hope you will understand my point and if it was misunderstood, my sincere apologies..

Vamsi M Maganti

gaddeswarup said...

Vamsi garu,
Unfortunately advertising identities through names (Sastry, naidu, reddy etc) and symbols(headear, naamaalu of different types) seems to a common phenomenon. I hope that it would go away.
About admiring people from other groups and identities I think that many do. Gandhi and Nehru were inspired by many westerners and had British friends but this fact did not prevent them for fighting for independence from the British.

vrdarla said...

abhinandanalu telipina andariki thanks.
prasidda rachayitri malathi gaaru abhinandanalu cheppadam chaalaa santosham gaa undi.thanks. alaage naganna, gadde swarup laku naa thanks.
vamsi gaaru!sudeeghamgaa charchincha valasina vishayaalanu, ee sandarbhamlo charchinchadam istam ledu