తెలుగు సాహిత్యంలో మాదిగల సామాజిక, సాంస్కృతిక అధ్యయనం’ అనే యు.జి.సి. వారి  ‘  మేజర్‌ రీసెర్చ్ ప్రాజెక్టుకి ఉపయోగ పడే సమాచారమేదైనా  మీ దగ్గర లభిస్తే  దయచేసి నాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. విలువైన సమాచారాన్ని అందజేసిన వారి వివరాలను  నా ప్రాజెక్టులోనూ, తర్వాత ప్రచురించే పరిశోధన గ్రంథంలోనూ పేర్కొనడం జరుగుతుంది.నా చిరునామా:-డా||దార్లవెంకటేశ్వరరావు,అసిస్టెంటు ప్రొఫెసరు, తెలుగు శాఖ,యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాదు (సెంట్రల్‌యూనివర్సిటి), గచ్చిబౌలి, హైదరాబాదు-46 నా మెయిల్:vrdarla@gmail.com నా ఫోను నెంబరు: 09989628049.

ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి ప్రసంగం



http://vrdarla.multiply.com/video/item/2



ప్రముఖ సాహితీవేత్త ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి స్మారకార్ధం హైదరాబాదు విశ్వవిద్యాలయంలో బుధవారం, 20-8-2008 సాయంత్రం సాహితీ సభ జరిగింది. ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారు గతంలో తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేశారు. జి.వి.ఎస్ . కళాపీఠం వారు ఎం.ఏ., ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందిన విద్యార్థినీ,విద్యార్థులకు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పముఖ విమర్శకులు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్యం గారు స్మారకోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో ఆచార్య బేతవోలు రామబ్రహ్మం, ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం గారి కుమారులు డా//విద్యానాథ్, శ్రీ రాధాకృష్ణ మూర్తి, ఉస్మానియా యూనివర్సిటి అద్యాపకుడు డా// వెలుదండ నిత్యానంద రావు, తెలుగుశాఖ అధ్యాపకులు , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రసంగం వీడియోను మీకు అందిస్తున్నాను.

0 comments: